ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది

26 Feb, 2021 06:02 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.చతుర్దశి ప.3.15 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం ఆశ్లేష ప.12.10 వరకు, తదుపరి మఖ వర్జ్యం రా.12.02 నుంచి 1.36 వరకు, దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.31 వరకు, తదుపరి ప.12.35 నుంచి 1.21 వరకు అమృతఘడియలు... ఉ.10.32 నుంచి 11.54 వరకు.

సూర్యోదయం :    6.25
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వర​కు

మేషం: శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి,వ్యాపారాలలో ఉత్సాహం. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. 

మిథునం: కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం: పనులలో కొంత అనుకూలత. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి  సంతృప్తికరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధన వ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.

ధనుస్సు: రుణాలు చేస్తారు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. కళాకారులకు కొన్ని చిక్కులు.

మకరం: కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది.

కుంభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.  కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

మీనం: కుటుంబంలో చికాకులు. అనుకోని సంఘటనలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణాలు ఉంటాయి. దైవచింతన.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు