ఈ రాశివారికి ఆహ్వానాలు అందుతాయి

26 Jun, 2021 06:29 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.విదియ రా.8.34 వరకు, తదుపరి తదియ నక్షత్రం పూర్వాషాఢ ఉ.6.34 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం ప.2.15 నుండి 3.47 వరకు, దుర్ముహూర్తం ఉ.5.32 నుండి 7.14 వరకు, అమృతఘడియలు... రా.11.30 నుండి 12.45 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు: 
మేషం: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటక: పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం : సన్నిహితుల నుంచి ధనలాభం. యత్నకార్యసిద్ధి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

కన్య: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణ వైరం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

ధనుస్సు: పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: పనులలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
 

మరిన్ని వార్తలు