గ్రహం అనుగ్రహం (27-07-2020)

27 Jul, 2020 05:53 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. శ్రావణ మాసం. తిథి శు.సప్తమి ఉ.9.22 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం చిత్త ప.1.59 వరకు, తదుపరి స్వాతి. వర్జ్యం రా.7.12 నుంచి 8.43 వరకు. దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు, తిరిగి ప.3.05 నుంచి 3.56 వరకు. అమృత ఘడియలు ఉ.8.02 నుంచి 9.31 వరకు. సూర్యోదయం: 5.40 సూర్యాస్తమయం: 6.32; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం...పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సోదరుల ద్వారా ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

వృషభం...సన్నిహితులు సాయపడతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం....మిత్రులతో విభేదాలు. అనుకున్న పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత చికాకులు.

కర్కాటకం...శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

సింహం...కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాల ప్రస్తావన. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య....కొత్త రుణాలు చేస్తారు. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

తుల....ఆశయాలు నెరవేరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు అనుకున్న విధంగా కొనసాగుతాయి.

వృశ్చికం...పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

ధనుస్సు...రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

మకరం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో మరింత గౌరవం. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

కుంభం...మిత్రులు శత్రువులుగా మారవచ్చు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. అనుకున్న పనులు ముందుకు సాగవు. కుటుంబంలో ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం....శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంతమేర సమస్యలు.

మరిన్ని వార్తలు