ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు

27 Aug, 2021 06:23 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.పంచమి సా.6.33 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం అశ్వని రా.1.35 వరకు, తదుపరి భరణి, వర్జ్యం రా.9.15 నుండి 11.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.08 వరకు, తదుపరి ప.12.26 నుండి 1.18 వరకు అమృతఘడియలు... సా.5.46 నుండి 7.30 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం     :  6.16
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం... చేపట్టిన పనులు  అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృషభం... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు.శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. 

మిథునం... ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. పనులలో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపార లావాదేవీలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కర్కాటకం... కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

సింహం... బంధువులతో విరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. 

కన్య... కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాల్లో చికాకులు. ఆరోగ్య సమస్యలు. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు తప్పకపోవచ్చు. 

తుల... పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ధనలబ్ధి. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.

వృశ్చికం... నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో ఉంటాయి. సన్నహితులతో ఆనందంగాగడుపుతారు.  వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగాల్లో సమస్యలు తీరతాయి. 

ధనుస్సు... అనుకోని సంఘటనలు. ఆప్తులతో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణయత్నాలలో ఆటంకాలు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

మకరం... ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో కలహాలు. ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

కుంభం... ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. వాహనాలు, భూములు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి పిలుపు. 

మీనం... పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.  

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు