గ్రహం అనుగ్రహం(27-09-2020)

27 Sep, 2020 06:18 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి శు.ఏకాదశి రా.9.25 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం శ్రవణం రా.11.23 వరకు తదుపరి ధనిష్ఠ, వర్జ్యం రా.3.33 నుంచి 5.14 వరకు దుర్ముహూర్తం సా.4.15 నుంచి 5.05 వరకు అమృతఘడియలు... ప.12.49 నుంచి 1.51 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.52
రాహుకాలం :  సా. 4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశిఫలం
మేషం: ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు చకచకా సాగుతాయి. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: ఏ పని చేపట్టినా మందకొడిగా సాగుతుంది. ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

మిథునం: బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రులతో స్వల్ప తగాదాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. నూతన పరిచయాలు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

సింహం: కొత్త పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వస్తులాభాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య: రుణబాధలు తొలగుతాయి. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

తుల: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యపరంగా చికాకులు. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. 

ధనుస్సు: మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మకరం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: పనుల్లో విజయం. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
 

మరిన్ని వార్తలు