ఈ రాశి వారిని బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

28 Apr, 2021 06:20 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.పాడ్యమి ఉ.7.30 వరకు, తదుపరి విదియ తె.4.57 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం విశాఖ రా.8.07 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం రా.11.49 నుంచి 1.20 వరకు, దుర్ముహూర్తం ప.11.32 నుంచి 12.22 వరకు, అమృతఘడియలు... ఉ.11.54 నుంచి 1.21 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులలతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. 

మిథునం:పనుల్లో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరాశ తప్పదు.

కర్కాటకం: కాంట్రాక్టర్లకు కొంత నిరాశ. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు కృషి ఫలించదు.

సింహం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన ప్రగతి కనిపించదు. .

తుల: అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం..

వృశ్చికం: మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి. దైవచింతన.. 

ధనుస్సు: కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. వాహనసౌఖ్యం.

మకరం: చిన్ననాట మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు.  

>
మరిన్ని వార్తలు