ఈ రాశివారికి వివాదాలు తీరతాయి

28 Dec, 2020 06:23 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.చతుర్దశి పూర్తి (24 గంటలు), నక్షత్రం రోహిణి ప.3.47 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం.. రా.9.47 నుంచి 11.31 వరకు, దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.06 వరకు, తదుపరి ప.2.33 నుంచి 3.18 వరకు, అమృతఘడియలు...ప.12.15 నుంచి 2.00 వరకు, రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు, యమగండం ఉ.10.30 నుంచి 10.30 వరకు, సూర్యోదయం 6.33, సూర్యాస్తమయం 5.30

రాశి ఫలాలు..

మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృషభం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ప్రగతి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

కర్కాటకం: పరిచయాలు మరింత పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనయోగం. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కీలక మార్పులు.

సింహం: కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. విద్యార్థులకు కొంత నిరాశ. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. వివాదాలు తీరతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మకరం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కకపోవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం: మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు