ఈ రాశివారు శుభవార్తలు వింటారు

28 Feb, 2021 06:13 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.పాడ్యమి ప.12.54 వరకు, తదుపరి విదియ, నక్షత్రం పుబ్బ ఉ.11.11 వరకు, తదుపరి ఉత్తర వర్జ్యం సా.6.04 నుండి 7.36 వరకు దుర్ముహూర్తం సా.4.27 నుండి 5.13 వరకు అమృతఘడియలు... ఉ.4.58 నుంచి 6.31 వరకు, తిరిగి రా.3.18 నుంచి 4.51 వరకు.

సూర్యోదయం        :  6.23
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: వ్యయప్రయాసలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ ఫలించదు. ఆరోగ్య భంగం.

వృషభం: శ్రమాధిక్యం. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటాయి.

మిథునం: పనుల్లో విజయం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనులలో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు చేస్తారు.

సింహం: బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు విస్తరిస్తాయి. ధన, వస్తులాభాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కన్య: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. దైవదర్శనాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

ధనుస్సు: రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప విభేదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. దైవదర్శనాలు. పరిస్థితులు అనుకూలించవు.

మకరం: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. ఆధ్యాత్మిక చింతన.బంధువుల కలయిక.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. పనులలో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులు అనుకూల ఫలితాలు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు