ఈ రాశివారి ఆస్తి వివాదాలు తీరతాయి

29 Mar, 2021 06:21 IST|Sakshi

సోమవారం – 29.3.2021 – శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం. తిథి బ.పాడ్యమి రా.11.03 వరకు, తదుపరి విదియ. నక్షత్రం హస్త సా.4.56 వరకు, తదుపరి చిత్త. వర్జ్యం రా.12.18 నుంచి 1.48 వరకు. దుర్ముహూర్తం ప.12.27 నుంచి 1.16 వరకు, తదుపరి ప.2.55 నుంచి 3.43 వరకు. అమృత ఘడియలు ఉ.11.04 నుంచి 12.34 వరకు

సూర్యోదయం 6.01
సూర్యాస్తమయం 6.08
రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు

రాశి ఫలాలు:
మేషం: చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు. సేవాధృక్ఫథం పెరుగుతుంది. ధనలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.

వృషభం: ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. దూరపు బంధువులను కలుస్తారు.

కర్కాటకం: ప్రముఖుల నుంచి ముఖ్యసమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు. ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

సింహం: ఆప్తులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు సంభవం. విలువైన వస్తువులు భద్రం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

కన్య: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల: కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. తీర్థయాత్రలు.

వృశ్చికం: సంఘంలో ఎనలేని గౌరవం. ఆప్తుల నుంచి శుభవార్తలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: నూతన విద్యావకాశాలు.  ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. కుటుంబంలో ఉత్సాహం.  పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఇబ్బందులు. దైవదర్శనాలు.

కుంభం: ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: ఉద్యోగయత్నాలు సాఫల్యం. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం.
వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు