ఈ రాశివారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

29 Jul, 2021 06:18 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.షష్ఠి తె.5.28 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ప.2.38 వరకు, తదుపరి రేవతి వర్జ్యం రా.3.24 నుండి 5.08 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుండి 10.47 వరకు, తదుపరి ప.3.04 నుండి 3.55 వరకు అమృతఘడియలు... ఉ.9.34 నుండి 11.18 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

మేషం...  ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం. కష్టానికి ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం... పనులలో పురోగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం...  కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కర్కాటకం...  బంధువర్గంతో అకారణంగా విరోధాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ తప్పదు. 

సింహం...  వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. బంధుమిత్రుల నుంచి విమర్శలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య... రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల...  సమస్యల నుంచి గట్టెక్కుతారు. భూములు, వాహనాలు కొంటారు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

వృశ్చికం...  కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు...  రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం...  కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మీనం....  కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు