ఈ రాశివారికి మిత్రులే శత్రువుల్లా మారతారు

3 Mar, 2021 06:27 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.చవితి ఉ.6.58 వరకు, తదుపరి పంచమి తె.4.35 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం చిత్త ఉ.7.24 వరకు తదుపరి స్వాతి తె.4.45 వరకు, వర్జ్యం ప.12.34 నుండి 2.04 వరకు దుర్ముహూర్తం ప.11.49 నుండి 12.35 వరకు, అమృతఘడియలు... రా.9.30 నుంచి 11.00 వరకు. 

సూర్యోదయం :    6.22
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు
 

మేషం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనయోగం. కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో
మరింత ప్రగతి.

వృషభం : సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

మిథునం : వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం : మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా కొనసాగుతాయి.

సింహం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో పురోగతి. బంధువుల ద్వారా ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య : ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

తుల : చిత్రవిచిత్ర సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం : రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు.

దనుస్సు : పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. శుభవార్తలు అందుతాయి. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మకరం : ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో  సత్తా చాటుకుంటారు.

కుంభం : మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం : అనుకున్న వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు