ఈ రాశివారికి ఆస్తి వివాదాల పరిష్కారం

3 May, 2021 06:34 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి బ.సప్తమి రా.6.56 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం, ఉత్తరాషాఢ ప.1.30 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం సా.5.24 నుంచి 7.01వరకు, దుర్ముహూర్తం ప.12.20 నుంచి 1.10 వరకు, తదుపరి ప.2.53 నుంచి 3.44 వరకు, అమృతఘడియలు... ఉ.7.20 నుంచి 8.44 వరకు.

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: పనుల్లో విజయం. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు. 

వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. 

మిథునం: ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. దైవచింతన. 

కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి. 

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. 

కన్య: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూవివాదాలు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. 

తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. 

వృశ్చికం: బంధువుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఇంటాబయటా ఒత్తిడులు. 

మకరం: ఉద్యోగయత్నాలు సానుకూలం. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. దైవచింతన. 

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

మీనం: రహస్య విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. 
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు