ఈ రాశివారికి ఉద్యోగాల్లో చికాకులు

30 Mar, 2021 06:30 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.విదియ రా.8.47 వరకు, తదుపరి తదియ నక్షత్రం చిత్త ప.3.21 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.8.32 నుంచి 10.03 వరకు, దుర్ముహూర్తం ఉ.8.24 నుంచి 9.14 వరకు, తదుపరి రా.10.53 నుంచి 11.41 వరకు అమృతఘడియలు... ఉ.9.18 నుంచి 10.46 వరకు.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం    :  6.08
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

రాశి ఫలాలు:
మేషం: ధనాదాయం పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూ, గృహయోగాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కర్కాటకం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలలో మార్పులు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం: ఆకస్మిక ధనలాభం. దైవదర్శనం. ఉద్యోగ అవకాశాలు. నూతన పరిచయాలు. పాత మిత్రులు కలయిక. వాహన యోగం. విందు వినోదాలు.వ్యాపార,ఉద్యోగాలలో అనుకూల వాతారణం.

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: స్థిరాస్తి వృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.

వృశ్చికం: రుణభారాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకున్న పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: వ్యవహారాలలో  విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

మరిన్ని వార్తలు