గ్రహం అనుగ్రహం (30-08-2020)

30 Aug, 2020 06:35 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శు.ద్వాదశి ఉ.9.05 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం ఉత్తరాషాఢ ప.3.31 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం రా.7.34 నుంచి 9.11 వరకు, దుర్ముహూర్తం సా.4.32 నుంచి 5.23 వరకు, అమృతఘడియలు... ఉ.9.04 నుంచి 10.53 వరకు, తిరిగి తె.5.20 నుంచి 6.56 వరకు (తెల్లవారితే సోమవారం).

సూర్యోదయం        :  5.48
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం: కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

వృషభం: శ్రమానంతరం పనులు పూర్తి. దూరప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మిథునం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో జాప్యం. మిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో తగినంత లాభాలు. ఉద్యోగాలలో ఊరట లభిస్తుంది.

సింహం: కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి ఒప్పందాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు.

కన్య: ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలం.

వృశ్చికం: మీ కృషి ఫలిస్తుంది. పనుల్లో విజయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సజావుగా సాగుతాయి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత సానుకూలం.

మకరం: పాతబాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు.

మీనం: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా పూర్తి. సమాజసేవలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

>
మరిన్ని వార్తలు