గ్రహం అనుగ్రహం (30-11-2020) 

30 Nov, 2020 06:14 IST|Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. కార్తీక మాసం. తిథి పౌర్ణమి ప.2.04 వరకు, తదుపరి బహుళ పాడ్యమి. నక్షత్రం కృత్తిక ఉ.6.07 వరకు, తదుపరి రోహిణి. వర్జ్యం రా.11.34 నుంచి 1.19 వరకు. దుర్ముహూర్తం ప.12.09 నుంచి 12.54 వరకు, తదుపరి ప.2.21 నుంచి 3.06 వరకు. అమృత ఘడియలు తె.4.51 నుంచి 6.32 వరకు (తెల్లవారితే మంగళవారం)

సూర్యోదయం: 6.16
సూర్యాస్తమయం: 5.20 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

మేషం: కొత్తగా చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఉద్యోగయత్నాలలో కదలికలు. ఉన్నతహోదాలలోని వారి సహాయం అందుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు వద్దు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. సమస్యల నుంచి గట్టెక్కుతారు. పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గవచ్చు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. సోదరుల నుంచి ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.

మకరం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి వివాదాలు.

కుంభం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.

మరిన్ని వార్తలు