గ్రహం అనుగ్రహం (31-07-2020)

31 Jul, 2020 05:57 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.ద్వాదశి రా.11.02 వరకు, తదుపరి, త్రయోదశినక్షత్రం జ్యేష్ఠ ఉ.8.32 వరకు, తదుపరి మూల, వర్జ్యం సా.4.16 నుంచి 5.51 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.06 వరకుతిరిగి ప.12.31 నుంచి 1.22 వరకు, అమృతఘడియలు... రా.1.34 నుంచి 3.07 వరకు, వరలక్ష్మీవ్రతం.

సూర్యోదయం :    5.41
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

గ్రహఫలం
మేషం.....పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం...మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనులలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం...శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. బంధువుల కలయిక. ఇంటాబయటా చికాకులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కర్కాటకం...చేపట్టిన పనుల్లో విజయం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం....పరపతి పెరుగుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కన్య....ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబసమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. 

తుల.....వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం...దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు...వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం...కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం...దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం....రుణాలు తీరతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు , ఉద్యోగాలలో పురోగతి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా