గ్రహం అనుగ్రహం (31-08-2020)

31 Aug, 2020 07:17 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. భాద్రపద మాసం. తిథి శు.త్రయోదశి ఉ.8.34 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం శ్రవణం ప.3.54 వరకు, తదుపరి ధనిష్ఠ. వర్జ్యం రా.8.01 నుంచి 9.43 వరకు. దుర్ముహూర్తం ప.12.24 నుంచి 1.14 వరకు, తదుపరి ప.2.53 నుంచి 3.44 వరకు. అమృత ఘడియలు  లేవు

సూర్యోదయం: 5.48 
సూర్యాస్తమయం: 6.13; 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: శుభవార్తా శ్రవణం. యత్నకార్యసిద్ధి. దూరపు బంధువుల ద్వారా ధనలబ్ధి. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

వృషభం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. 

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. కుటుంబంలో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

సింహం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

తుల: కుటుంబ సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో సఖ్యత వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం: కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. 

మీనం: మిత్రులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విశేష గౌరవం లభిస్తుంది.
 

మరిన్ని వార్తలు