ఈ రాశివారికి గౌరవమర్యాదలకు లోటు ఉండదు

3 Jul, 2021 06:29 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.నవమి రా.7.12 వరకు తదుపరి దశమి, నక్షత్రం రేవతి ఉ.8.45 వరకు తదుపరి అశ్వని, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ఉ.5.34 నుండి 7.18 వరకు అమృతఘడియలు... ఉ.6.10 నుంచి 7.55 వరకు.

సూర్యోదయం :    5.33
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు: 

మేషం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

వృషభం: కొత్తగా అప్పులు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పదు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.

మిథునం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు  అరుదైన పురస్కారాలు.

కర్కాటకం: శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి. గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

సింహం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

కన్య: కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనులలో అవాంతరాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో మార్పులు.

తుల: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

వృశ్చికం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

ధనుస్సు: ధనవ్యయం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో  ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం. 

కుంభం: ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. దైవదర్శనాలు. ఆస్తిలాభ సూచనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో  కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
 

మరిన్ని వార్తలు