ఈ రాశివారికి ఆకస్మిక ధనలబ్ధి

4 Jul, 2021 06:33 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.దశమి రా.8.47 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం అశ్వని ఉ.10.55 వరకు, తదుపరి భరణి వర్జ్యం ఉ.6.32 నుండి 8.18 వరకు తిరిగి రా.9.27 నుండి 11.13 వరకు దుర్ముహూర్తం సా.4.51 నుండి 5.41 వరకు, అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం        :  5.32
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:

మేషం : పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా వివాదాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిధునం: సన్నిహితులతో సఖ్యత. శుభకార్యాలపై చర్చలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

కన్య: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కొన్ని పరిస్థితులకు ఎదురీదవలసివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

వృశ్చికం: గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: కొన్ని పనులు వాయిదా వేయాల్సివస్తుంది. ప్రయాణాలు కుదించుకుంటారు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. పనులలో విజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మీనం: సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు 

మరిన్ని వార్తలు