ఈ రాశి వారికి పనుల్లో విజయం

4 Jun, 2021 06:14 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.నవమి ఉ.5.53 వరకు, తదుపరి దశమి నక్షత్రం ఉత్తరాభాద్ర రా.11.32 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం ఉ.8.18 నుండి 9.58 వరకు, దుర్ముహూర్తం ఉ.8.03 నుండి 8.54 వరకు తదుపరి ప.12.24 నుండి 1.14 వరకు, అమృతఘడియలు... సా.6.24 నుంచి 8.04 వరకు, హనుమజ్జయంతి.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. దైవదర్శనాలు.

వృషభం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.

మిథునం: అరుదైన ఆహ్వానాలు రాగలవు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాభివృద్ధి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుసుకుంటారు.

సింహం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు.

తుల: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు.

వృశ్చికం: దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. ఉద్యోగులకు పనిభారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

మీనం: నూతన ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.
 

మరిన్ని వార్తలు