ఈ రాశి వారికి మిత్రులతో విభేదాలు

5 Mar, 2021 06:05 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.సప్తమి రా.11.53 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం అనూరాధ రా.2.25 వరకు, తదుపర జ్యేష్ఠ, వర్జ్యం ఉ.7.45  నుండి 9.15 వరకు, దుర్ముహూర్తం ఉ.8.41 నుండి 9.28 వరకు తదుపరి ప.12.35 నుండి 1.21 వరకు, అమృతఘడియలు... సా.4.42 నుంచి 6.12 వరకు.

సూర్యోదయం :    6.20
సూర్యాస్తమయం    :  6.03
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఖర్చులు మరింత పెరుగుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మిథునం: కాంట్రాక్టులు దక్కుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు.. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య: పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

తుల: పనులలో అవాంతరాలు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పనుల్లో అనుకూలత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: పనులలో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. భూలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా  సాగుతాయి.

మీనం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. పనులు సజావుగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు