ఈ రాశివారికి బాకీలు వసూలవుతాయి..

5 Jul, 2021 06:21 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.ఏకాదశి రా.10.40 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం భరణి ప.1.21 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం రా.2.36 నుండి 4.22 వరకు, దుర్ముహూర్తం ప.12.31 నుండి 1.23 వరకు తదుపరి ప.3.06 నుండి 3.57 వరకు అమృతఘడియలు... ఉ.8.01 నుండి 9.46 వరకు.

సూర్యోదయం :    5.33
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం.

వృషభం: పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులు, మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం: సన్నిహితులతో సఖ్యత. కొత్త పనులకు శ్రీకారం. ముఖ్య సమాచారం అందుతుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాం.

కర్కాటకం: ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

కన్య: రుణభారాలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. పనులు విజయవంతంగా ముగిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: కుటుంబంలో కొత్త సమస్యలు. ముఖ్య వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. సోదరులతో విభేదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల  నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
 

మరిన్ని వార్తలు