ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు

6 Mar, 2021 06:01 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి బ.అష్టమి రా.9.38 వరకు తదుపరి నవమి, నక్షత్రం జ్యేష్ఠ రా.12.56 వరకు, తదుపరి మూల, వర్జ్యం ఉ.7.40 నుండి 9.11 వరకు దుర్ముహూర్తం ఉ.6.21 నుండి 7.54 వరకు అమృతఘడియలు... సా.4.40 నుంచి 6.10 వరకు.

సూర్యోదయం :    6.20
సూర్యాస్తమయం    :  6.03
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

మేషం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం.  బంధువులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మిథునం: శుభవార్తలు వింటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కర్కాటకం: వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో వివాదాలు. పనుల్లో జాప్యం. అనుకోని సంఘటనలు. బాధ్యతలు పెరుగుతాయి. దైవచింతన. 

సింహం: బంధువుల నుంచి ఒత్తిడులు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 

తుల: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. కళాకారులకు ఒత్తిడులు.

వృశ్చికం: పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగమార్పులు.

మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. 

కుంభం: శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.

మీనం: రుణదాతల ఒత్తిడులు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.
 


 
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు