Daily Horoscope: ఈ రాశివారికి ఆర్థిక ప్రగతి

6 May, 2021 06:33 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.దశమి సా.5.06 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం శతభిషం ప.1.32 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం రా.8.11 నుంచి 9.53 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.41 వరకు, తదుపరి ప.2.55 నుంచి 3.45 వరకు అమృతఘడియలు... ఉ.6.11 నుంచి 7.49 వరకు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు: 
మేషం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు. 

వృషభం: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

మిథునం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు నిరాశ. 

కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అంతగా అనుకూలించదు. 

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు. 

కన్య: రుణఒత్తిడులు తొలగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

తుల: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 

వృశ్చికం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం. విద్యార్థులకు ఒత్తిడులు. 

ధనుస్సు: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. గృహ, వాహనయోగాలు. దైవదర్శనాలు.  వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

మకరం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. 

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. విచిత్రమైన సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. 

మీనం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యభంగం.

>
మరిన్ని వార్తలు