ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు..

6 Jul, 2021 06:20 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.ద్వాదశి రా.12.41 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ప.3.55 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం... లేదు. దుర్ముహూర్తం ఉ.8.10 నుండి 9.02 వరకు తదుపరి రా.10.56 నుండి 11.42 వరకు అమృతఘడియలు... ప.1.15 నుండి 3.01 వరకు.

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొమ్ము అందక ఇబ్బందులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం.

వృషభం: మిత్రుల సహకారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

మిథునం: ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

కర్కాటకం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణయత్నాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు.

తుల: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక ప్రగతి. రుణఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కుంభం: బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. 
 

మరిన్ని వార్తలు