ఈ రాశివారికి అనుకోని ధనవ్యయం

7 Jul, 2021 06:26 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.త్రయోదశి రా.2.35 వరకు, తదుపరి చతుర్ధశి, నక్షత్రం రోహిణి సా.6.31 వరకు, తదుపరి మృగశిర వర్జ్యం ఉ.9.38 నుండి 11.27 వరకు, తిరిగి రా.12.40 నుండి 2.26 వరకు, దుర్ముహూర్తం ప.11.37 నుండి 12.31 వరకు అమృతఘడియలు... ప.2.56 నుండి 4.43 వరకు.

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆలయ దర్శనాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. బంధువర్గం నుంచి విమర్శలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్య పరిష్కారం. సోదరులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం: కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని వివాదాలలో పరిష్కారం దొరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు పైచేయి సాధిస్తారు.

కన్య: శ్రమాధిక్యం. కొన్ని  పనులు మధ్యలో వాయిదా. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.  అనారోగ్యం.

వృశ్చికం: శుభవార్తలు అందుతాయి. సోదరులు, బంధువుల నుంచి ధనలాభం. సమాజ సేవలో పాల్గొంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.

ధనుస్సు: ఒక సమస్య నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు అందుతుంది.  కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో మరింత సానుకూలత.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు.  మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమకు ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ధనవ్యయం.

మీనం: పాతమిత్రుల కలయిక. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు