Today Telugu Horoscope: నేడు ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, శుభవార్త అందుతుంది

12 Feb, 2024 07:23 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.తదియ రా.10.40 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.40 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: తె.4.37 నుండి 6.09 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.21 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు,

అమృతఘడియలు: ప.12.11 నుండి 1.40 వరకు;
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
సూర్యోదయం: 6.35,
సూర్యాస్తమయం: 5.53. 

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

వృషభం: శుభవర్తమానాలు. రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు రద్దు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: నూతన పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు సంతృప్తినిస్తాయి. 

కన్య: సోదరుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.

తుల: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

వృశ్చికం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో నిరాశ.

ధనుస్సు: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

మకరం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

కుంభం: పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

మీనం: అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. కొన్ని పనులలో ఆటంకాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega