Today Telugu Horoscope :పలుకుబడి పెరుగుతుంది, వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

23 Aug, 2023 07:16 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, నిజ శ్రావణ  మాసం, తిథి: శు.సప్తమి రా.10.07 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: విశాఖ æతె.5.04 వరకు  (తెల్లవారితే గురువారం), తదుపరి అనూరాధ, వర్జ్యం: ఉ.10.19 నుండి 11.56 వరకు, దుర్ముహూర్తం: ప.11.36 నుండి  12.27 వరకు, అమృతఘడియలు: రా.8.04 నుండి 9.42 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.47, సూర్యాస్తమయం: 6.19. 

మేషం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కౌన్ని వసూలవుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

వృషభం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలమైన పరిణామాలు. సంఘంలో గౌరవం. 

మిథునం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు మోయాల్సివస్తుంది.

కర్కాటకం: రుణాలు చేస్తారు. పనుల్లో మరింత జాప్యం. బంధు,మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు.

కన్య: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని  మార్పులు.

తుల: కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.

ధనుస్సు: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు.  విద్య, ఉద్యోగావకాశాలు. పరపతి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. ్త, వ్యాపారాలలో లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మీనం: పరిస్థితులు అనుకూలించవు.  వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం.. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.

మరిన్ని వార్తలు