ఈ రాశివారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు

1 Nov, 2023 05:54 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.చవితి రా.10.40 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రోహిణి ఉ.6.09 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ఉ.11.54 నుండి 1.32 వరకు, దుర్ముహూర్తం: ప.11.22 నుండి 12.08 వరకు, అమృత ఘడియలు: రా.9.44 నుండి 11.22 వరకు.; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.02, సూర్యాస్తమయం: 5.27. 
 

మేషం... కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం... బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కర్కాటకం.... కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం.... కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. భూలాభం.

కన్య.... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

తుల.... కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

వృశ్చికం.... పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం..... వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. విలువైన వస్తువులు చేజారవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

కుంభం.. బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

మీనం.... వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
 

మరిన్ని వార్తలు