ఈ రాశి వారికి అన్నింటా విజయమే, వస్తులాభం

3 Mar, 2023 06:49 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.ఏకాదశి ఉ.8.53 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పునర్వసు సా.4.27 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: రా.1.21 నుండి 3.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.42 నుండి 9.29 వరకు, తదుపరి ప.12.34 నుండి 1.23 వరకు, అమృతఘడియలు: ప.1.47 నుండి 2.45 వరకు

సూర్యోదయం :    6.22
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు మార్పులు.

కన్య: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

తుల: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు: బంధువులతో విభేదాలు. ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు కాస్త చికాకు పరుస్తాయి.

మరిన్ని వార్తలు