ఈ రాశివారి అంచనాలు నిజమవుతాయి, అనుకూల ఫలితాలు

5 Jun, 2023 06:34 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.7.36 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: మూల రా.3.32 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.17 నుండి 1.49 వరకు, తిరిగి రా.1.58 నుండి 3.32 వరకు, దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.20 వరకు, తిరిగి ప.3.05 నుండి 3.56 వరకు, అమృతఘడియలు: రా.9.15 నుండి 10.45 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27. 

మేషం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళపరిస్థితి. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. అంచనాలు నిజమవుతాయి. సంఘంలో గౌరవం. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. 

మిథునం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. కొత్త పనులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనయోగం. 

కర్కాటకం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. బంధువులను కలుసుకుంటారు. 

సింహం: కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: శ్రమాధిక్యం. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువులు, మిత్రులతో వివాదాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. 

వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటిలో శుభకార్యాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి,వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. 

ధనుస్సు: ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. 

మకరం: ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. 

కుంభం: ఇంటాబయటా అనుకూలస్థితి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: బంధువులతో వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో తొందరపాటు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
 

మరిన్ని వార్తలు