Horoscope Today - ఈ రాశివారు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు, పనుల్లో విజయం

7 Jun, 2023 06:33 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: తిథి బ.చవితి రా.1.16 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.37 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.9.41 నుండి 11.11 వరకు, తిరిగి తె.4.22 నుండి 5.52 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.23 వరకు, అమృతఘడియలు: సా.6.34 నుండి 8.02 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు. 

వృషభం: ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. 

మిథునం: పనులు వాయిదా పడతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. 

కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. గృహ, వాహనయోగం. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ముందుకు సాగుతారు. 

సింహం: ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పనుల్లో విజయం.

కన్య: బంధువులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. 

తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం తప్పదు. మిత్రులతో విభేదాలు. నిరుద్యోగులకు నిరాశ. వృత్తి,వ్యాపారాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం  చేస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలు మందగిస్తాయి. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు నిరాశ.

మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వాహనయోగం. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు మంచిర్యాంకులు సాధిస్తారు. 

కుంభం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఒప్పందాలు వాయిదా.పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: పనులు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. బంధువుల కలయిక.
 

మరిన్ని వార్తలు