ఈ రాశి వారు శుభవార్త వింటారు, ధనలాభం

8 Mar, 2023 06:47 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.పాడ్యమి రా.7.12 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర రా.3.55 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ఉ.9.54 నుండి 11.37 వరకు, దుర్ముహూర్తం: ప.11.46 నుండి12.33 వరకు, అమృతఘడియలు: రా.8.10 నుండి 9.55 వరకు.

సూర్యోదయం :    6.18
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం: చిన్ననాటి మిత్రుల నుంచి వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

వృషభం: రుణబాధలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. పనులలో ఆటంకాలు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కర్కాటకం: చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

సింహం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని అనుకూల మార్పులు.

తుల: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం: ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. 

మకరం: స్వీయనిర్ణయాలు తగదు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. 

కుంభం: శ్రమ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చిత్రమైన సంఘటనలు. ధనలాభాలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలరీత్యా ఖర్చులు. సోదరులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలలో ఆటంకాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

మరిన్ని వార్తలు