ఈ రాశి వారు శుభవార్త వింటారు, ధనలాభం

10 Mar, 2023 06:59 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.తదియ రా.8.25 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: చిత్త తె.5.58 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి స్వాతి, వర్జ్యం ప.1.27 నుండి 3.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.14 వరకు, తదుపరి ప.12.34 నుండి 1.22 వరకు, అమృతఘడియలు: రా.11.21 నుండి 1.02 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.17, సూర్యాస్తమయం: 6.04 

మేషం: వ్యవహారాలు మరింత వేగంగా సాగుతాయి. ఆప్తుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి.

వృషభం: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం: దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: మీ సత్తా చాటుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటర్వ్యూలు రాగలవు. ధనప్రాప్తి. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో మీ అంచనాలు నెరవేరతాయి.

తుల: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలతో గడుపుతారు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించినరీతిలో ఉంటాయి.

ధనుస్సు: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం: వ్యయప్రయాసలు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగని పరిస్థితి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.

కుంభం: ఎంత పట్టుదలతో ఉన్నా పనులను పూర్తి చేయలేరు. ఆకస్మిక ప్రయాణాలు. రుణభారాలు తప్పదు. పట్టుదల వద్దు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: వ్యవహారాలు పుంజుకుంటాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. స్నేహితులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మరిన్ని వార్తలు