దినఫలం: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం, మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

11 Mar, 2023 06:39 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, 
సూర్యోదయం :    6.16
సూర్యాస్తమయం    :  6.04
తిథి: బ.చవితి రా.8.16 వరకు, తదుపరి పంచమి, 
నక్షత్రం: స్వాతి పూర్తి (24గంటలు), 

వర్జ్యం: ప.11.41 నుండి 1.19 వరకు, 
దుర్ముహూర్తం: ఉ.6.17 నుండి 7.51 వరకు,
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

అమృతఘడియలు: రా.9.24 నుండి 11.02 వరకు.


మేషం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. విందువినోదాలు. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో  ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం..

మిథునం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విద్యార్థులకు కృషి చేసినా ఆశించిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కర్కాటకం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు.

సింహం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  శుభవార్తలు.

కన్య: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృధా ఖర్చులు.  వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఇబ్బందులు. అనారోగ్య సూచనలు.

తుల: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు.దేవాలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో  లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. బంధువిరోధాలు. మానసిక అశాంతి.  వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. కళాకారులకు నిరాశ తప్పదు.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మకరం: పరపతి పెరుగుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు.  సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు..

కుంభం: బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.

మరిన్ని వార్తలు