ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు, శుభవార్తలు

14 Mar, 2023 06:44 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.సప్తమి సా.5.06 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: జ్యేష్ఠ తె.4.34 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.10.53 నుండి 12.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.35 నుండి 9.24 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు, అమృతఘడియలు: రా.8.04 నుండి 9.37 వరకు.

సూర్యోదయం :    6.14
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: పనుల్లో విజయం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష ప్రగతి.

మిథునం: ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: పనులు ముందుకు సాగవు. అర్థిక పరిస్థితి మందగిస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కన్య: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. భూలాభాలు గడిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు మీకు సంతోషాన్నిస్తాయి.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: రుణబాధలు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

మకరం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పరిచయాలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కుంభం: కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. మిత్రులతో వివాదాలు తీరతాయి.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉంటుంది.

మీనం: వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు. రుణయత్నాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. కొన్ని అంచనాలు తప్పుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
 

మరిన్ని వార్తలు