ఈ రాశివారికి ఈ రోజు తిరుగులేదు..

15 Mar, 2023 06:49 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.అష్టమి ప.3.19 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: మూల రా.3.19 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.09 నుండి 1.40 వరకు, తిరిగి రా.1.46 నుండి 3.19 వరకు, దుర్ముహూర్తం: ప.11.44 నుండి 12.34 వరకు, అమృతఘడియలు: రా.9.13 నుండి 10.44; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.13, సూర్యాస్తమయం: 6.06. 

మేషం: కొన్ని పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా నడుస్తాయి.

వృషభం: మీ కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల ఒప్పందాలు వాయిదా. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా మారవచ్చు.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు సమకూరతాయి. ఆర్థికాబివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయి.

కర్కాటకం: ఎంతటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా కొనసాగుతాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ఇంటాబయటా సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

కన్య: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులతో తగాదాలు. ప్రయాణాలు సంభవం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

తుల: శుభవార్తలు వింటారు. ఆదాయానికి లోటు రాదు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమ ఫలించే సమయం. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా పుంజుకుంటాయి.

వృశ్చికం: ప్రయాణాలలో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. బంధువులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

ధనుస్సు: దూరపు బంధువులతో చర్చలు. సంఘంలో విశేష ఆదరణ. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.

కుంభం: దూర ప్రాంతాల నుండి ముఖ్య సందేశం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆర్థికంగా బలపడతారు. మీ ఆలోచనలు తక్షణం అమలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మరిన్ని వార్తలు