ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు..

16 Mar, 2023 06:47 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.నవమి ప.1.15 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పూర్వాషాఢ రా.1.51 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.12.20 నుండి 1.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.09 నుండి 10.56 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృతఘడియలు: రా.9.20 నుండి 10.48 వరకు.

సూర్యోదయం:    6.13
సూర్యాస్తమయం :  6.06
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం :  ఉ. 6.00 నుండి 7.30 వరకు 

మేషం: సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆధ్యాత్మిక చింతన. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కర్కాటకం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉన్నత స్థితి.

సింహం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరవుతారు.

కన్య: పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.

వృశ్చికం: ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

ధనుస్సు: నూతనోత్సాహం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మకరం: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. ధనవ్యయం.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. దైవదర్శనాలు చేసుకుంటారు. 

మరిన్ని వార్తలు