శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.త్రయోదశి రా.10.22 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: రేవతి ఉ.7.52 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: రా.3.23 నుండి 4.56 వరకు, దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.22 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.45, సూర్యాస్తమయం: 6.41.
మేషం: ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో నూతన అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృషభం: ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.
మిథునం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాబడి తగ్గుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాల్లో మార్పులు. రాబడి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రమపడాలి.
సింహం: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి..
కన్య: బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
తుల: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు.
వృశ్చికం: పనులు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. దేవాలయ దర్శనాలు.
ధనుస్సు: పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం.
మకరం: ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు కొత్త ఆశలు.
కుంభం: ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. భూవివాదాలు. అనుకోని ఖర్చులు. వ్యాపారులకు తొందరపాటు తగదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
మీనం: కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. ఇతరుల నుంచి విమర్శలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.