ఈ రాశివారు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు..

18 Mar, 2023 06:32 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.8.34 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: శ్రవణం రా.10.54 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.2.19 నుండి 3.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.12 నుండి 7.45 వరకు, అమృతఘడియలు: ప.12.54 నుండి 2.22 వరకు.

సూర్యోదయం :    6.11
సూర్యాస్తమయం:  6.06
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృషభం: బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఊహించని ధనలాభం. దూరపు బం«ధువుల కలయిక. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులలో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

తుల: చేపట్టిన పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత చికాకులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలలో మెరుగుదల. పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలమవుతాయి.

ధనుస్సు: పనుల్లో తీవ్ర జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.  ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

మకరం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల పరిచయం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు మ«ధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగ మార్పులు.

మీనం: కార్యజయం. అనూహ్యమైన నిర్ణయాలు. పలుకుబడి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో తగినంత ప్రోత్సాహం.

 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు