శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.తదియ ఉ.10.16 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: చిత్త ఉ.11.06 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: సా.4.55 నుండి 6.34 వరకు, దుర్ముహూర్తం: ప.12.20 నుండి 1.09 వరకు, తదుపరి ప.2.44 నుండి 3.34 వరకు,
అమృతఘడియలు: రా.2.56 నుండి 4.34 వరకు, వినాయక చవితి;
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
సూర్యోదయం: 5.51, సూర్యాస్తమయం: 6.00.
మేషం: వ్యవహారాలలో సానుకూలత. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం: పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. చర్చలు సఫలం.వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. చిత్రవిచిత్ర సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
కర్కాటకం: బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
సింహం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: కష్టానికి తగిన ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. ధన, వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం: వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు. ఇంటాబయటా బాధ్యతలు. దూరప్రయాణాలు. ఆస్తులు వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
ధనుస్సు: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి కీలక సందేశం. వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు అభివృద్ధి చెందుతాయి.
మకరం: ముఖ్య విషయాలు గ్రహిస్తారు. కొత్త విద్యావకాశాలు. నిరుద్యోగులకు అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. బంధువిరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.