Today Horoscope Telugu: ఈ రాశి వారికి ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది

19 Feb, 2023 06:59 IST|Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి బ.చతుర్దశి ప.3.56 వరకు తదుపరి అమావాస్య నక్షత్రం శ్రవణం ప.2.32 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం సా.6.13 నుండి 7.44 వరకు, దుర్ముహూర్తం సా.4.24 నుండి 5.13 వరకు అమృతఘడియలు...రా.3.10 నుండి 4.41 వరకు రాహుకాలం సా.4.30 నుండి 6.00 వరకు యమగండం ప.12.00 నుండి 1.30 వరకు.. సూర్యోదయం 6.29 సూర్యాస్తమయం 5.58 

మేషం: వ్యవహారాలలో అనూహ్య విజయం. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం: పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని ఒడిదుడుకులు.

మిథునం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

కర్కాటకం: ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు.

సింహం: వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

కన్య: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

తుల: కొన్ని పనులు విరమిస్తారు. ప్రయాణాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

వృశ్చికం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.

ధనుస్సు: కుటుంబంలో సమస్యలు. రుణబాధలు. ఆరోగ్యభంగం. శ్రమతో కొన్ని పనులు పూర్తి. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మకరం: ఇంట్లో వేడుకలు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కార్యజయం. వాహనయోగం. బం«ధువుల ద్వారా ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలు పుంజుకుంటాయి.

కుంభం: వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఒక సమాచారం గందరగోళ పరుస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం: ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. వ్యవహారాలలో పురోగతి. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మరిన్ని వార్తలు