ఈ రాశివారు అన్నింటా సక్సెస్‌.. దూసుకుపోతారు

19 Mar, 2023 06:37 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ. ద్వాదశి ఉ.6.09 వరకు, తదుపరి త్రయోదశి రా.3.52 వరకు, నక్షత్రం: ధనిష్ఠ రా.8.54 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం: రా.3.41 నుండి 5.11 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.19 వరకు, అమృతఘడియలు: ప.11.13 నుండి 12.42 వరకు.

సూర్యోదయం        :  6.10
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార , ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

వృషభం: ప్రముఖులు సహాయపడతారు. అనుకున్న పనుల్లో విజయం మీదే. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: పరిస్థితులు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలతో సతమతమమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. శ్రమ ఫలించే సమయం. ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కన్య: రుణభారాలు తగ్గుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత సానుకూలం.

తుల: పనుల్లో మరింత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి లాభ సూచనలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలు కలసివస్తాయి.

మకరం: కుటుంబంలో చికాకులు. జీవితభాగస్వామితో కలహాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యపరంగా చికాకులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో  గందరగోళంలో పడతాయి.

మరిన్ని వార్తలు