ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది, ఆకస్మిక ధనప్రాప్తి

19 May, 2023 06:56 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: అమావాస్య రా.8.48 వరకు తదుపరి జ్యేష్ఠ శు.పాడ్యమి, నక్షత్రం: భరణి ఉ.7.11 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.7.23 నుండి 9.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.55 వరకు తదుపరి ప.12.22 నుండి 1.14 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.38
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

వృషభం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

వృశ్చికం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

మకరం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మీనం: శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు