ఈ రాశి వారికి ఎదురుండదు.. దూసుకుపోతారు..

20 Feb, 2023 06:50 IST|Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి అమావాస్య ప.1.39 వరకు తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి నక్షత్రం ధనిష్ఠ ప.12.54 వరకు తదుపరి శతభిషం వర్జ్యం రా.7.38 నుండి 9.06 వరకు దుర్ముహూర్తం ప.12.36 నుండి 1.23 వరకు తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు అమృతఘడియలు... తె.4.38 నుండి 5.56 వరకు(తెల్లవారితే మంగళవారం) రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం 6.29 సూర్యాస్తమయం 5.59

మేషం: కార్యజయం. కొన్ని వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ఆదాయం పెరుగుతుంది. భూలాభాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. శ్రమ తప్పదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళ పరుస్తాయి.

కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో కలహాలు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీకు ఎదురుండదు.

కన్య: ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

వృశ్చికం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలతో సతమతం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ అంచనాలు నిజం కాగలవు. అనుకోని ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలు అంచనాలకు మించి ముందుకు సాగుతాయి.

మకరం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

కుంభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

మీనం: శ్రమ మరింత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో గందరగోళం. ఆరోగ్యసమస్యలు. చర్చలు విఫలం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.


 

మరిన్ని వార్తలు