ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, ఆస్తిలాభం..

20 May, 2023 06:27 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి రా.8.43 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: కృత్తిక ఉ.7.34 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: రా.12.09 నుండి 1.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.11 వరకు, రాహుకాలం ఉ.9.00 నుండి 10.30 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.46, సూర్యాస్తమయం: 6.38. 

మేషం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం.

కన్య: కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఖర్చులు అధికం. పనుల్లో జాప్యం. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: కొత్త రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

మీనం: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
 

మరిన్ని వార్తలు