ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది, ఆశ్చర్యకరమైన సంఘటనలు

21 May, 2023 07:00 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు. విదియ రా.9.11 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: రోహిణి ఉ.8.26 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.2.22 నుండి 4.04 వరకు, దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.31 వరకు, అమృతఘడియలు: ఉ.5.06 నుండి 6.46 వరకు.

సూర్యోదయం        :  5.30
సూర్యాస్తమయం    :  6.22
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. చర్చల్లో ప్రతిష్ఠంభన. సోదరులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మిథునం: వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. అనారోగ్యం. 

కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

సింహం: ఇంటాబయటా అనుకూలం. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు. 

కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో వివాదాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. 

తుల: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. 

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

మకరం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. 

కుంభం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం.

మీనం: కొత్త  పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక చింతన.

మరిన్ని వార్తలు