ఈ రాశి వారికి ఆటంకాలు తొలగుతాయి, ధనలాభం

22 Sep, 2023 06:51 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.సప్తమి ఉ.9.07 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: జ్యేష్ఠ ప.12.26 వరకు, తదుపరి మూల. వర్జ్యం: రా.8.11 నుండి 9.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.07 వరకు, అమృతఘడియలు: తె.5.28 నుండి 7.01 వరకు (తెల్లవారితే శనివారం).

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.56
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు
 

మేషం: కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం.

వృషభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు.

మిథునం: చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం. నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం.  ఆసక్తికరమైన సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక చింతన.

తుల: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృశ్చికం: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగులకు ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారవృద్ధి.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: దూరపు బంధువుల కలయిక. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.

మరిన్ని వార్తలు