ఈ రాశివారికి గుడ్‌న్యూస్‌.. ఆసక్తికర సమాచారం వింటారు..

23 Mar, 2023 07:04 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ  సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.విదియ రా.8.32 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: రేవతి సా.4.13 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.10.07 నుండి 10.55 వరకు, తదుపరి  ప.2.55 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ప,1.50 నుండి 3.24 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.06, సూర్యాస్తమయం: 6.07. 

మేషం: వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: కొన్ని విషయాలు ఆసక్తి కలిగిస్తాయి. ప్రధాన సమావేశాలలో పాల్గొంటారు. మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం: కొత్త ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. బంధువులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకం: కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం రాగలదు. భూలాభాలు. కార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి.

కన్య: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల: రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృశ్చికం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రులతో విరోధాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మకరం: కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు.

కుంభం: దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తగ్గుతుంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు.


 

మరిన్ని వార్తలు