ఈ రాశివారు నిర్ణయాలు మార్చుకుంటారు

25 Jan, 2023 07:02 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.చవితి రా.6.32 వరకు, తదుపరి పంచమి,  నక్షత్రం: పూర్వాభాద్ర రా.2.06 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.9.23 నుండి 10.54 వరకు, దుర్ముహూర్తం: ప.11.51 నుండి 12.33 వరకు, అమృతఘడియలు: సా.6.30 నుండి 8.01 వరకు

సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం :  5.47
రాహుకాలం : ప.12.00
నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు  

మేషం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ధన, వస్తులాభాలు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మిథునం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం: ఇతరులకు సైతం సాయపడతారు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం. పనుల్లో ప్రతిష్ఠంభన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తుల: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. 

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. వ్యవహారాలలో అవాంతరాలు.  అనుకోని ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: కొత్త∙వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.

మకరం: పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. వైద్యసేవలు.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. ధనలాభం. నూతన ఒప్పందాలు. ఆస్తిలాభ సూచనలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆధ్యాత్మిక చింతన.  ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మరిన్ని వార్తలు